
పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.27/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
ముంతా తుఫాన్ నేపథ్యంలో ప్రతి పంచాయతీలోనూ తాగునీరు క్లోరినేషన్తో పాటు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కూడా చేయించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తుఫాను మండల ప్రత్యేక అధికారి విజయ్ భరత్ రెడ్డి కోరారు.తుఫాను ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా విజయ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో తుఫాన్ ప్రభావం అధికమవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తారు.అందువల్ల పంచాయతీ సెక్రటరీలు అందరూ మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. ఎవరికి కూడా సెలవులు లేవన్నారు.ప్రతి పంచాయతీలను చెరువులను పరిశీలించి వాటి పటిష్టతను అంచనా వేయాలన్నారు.దీంతోపాటు పడుతున్న వర్షాలకు తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలపై ఉందన్నారు.గ్రామాల్లో ఎక్కడైనా చెట్లు పడిపోయే స్థితిలో ఉన్నట్లయితే ముందుగానే వాటిని గుర్తించాలన్నారు.అధిక వర్షాలు పడితే లోతట్టు ప్రాంత వాసులను తరలించి వారికి పునరావసం కల్పించడానికి పాఠశాల భవనాలను స్వాధీనం చేసుకోవాలన్నారు.విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లయితే సమాచారాన్ని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు.ఈ నాలుగు ఐదు రోజుల్లో ప్రసవించే గర్భవతులను గుర్తించి సమీప ఆస్పత్రిలో చేర్పించడానికి చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు.ఈ సమావేశంలో ఎస్ఐ రామస్వామి,తహసిల్దారు రాజశేఖర్,మండల పరిషత్ పరిపాలన అధికారి త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.