పయనించే సూర్యుడు న్యూస్10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జె.సి. అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఎనిమిదిన్నర, గంటలకు ముగ్గుల పోటీ మహిళలకు నిర్వహించడం జరుగుతుందని మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు ఇవ్వబడునని తెలిపారు. ఒకటో బహుమతి రిఫ్రిజిరేటర్, రెండవ బహుమతి వాషింగ్ మిషన్, మూడో బహుమతి ఎయిర్ కూలర్, నాలుగో బహుమతి లక్ష్మీ చెన్నకేశవ స్వామి వెండి ప్రతిమ, ఐదవ బహుమతి గ్రైండర్, ఆరవ బహుమతి రైస్ కుక్కర్, ఏడవ బహుమతి మిక్సీ, 8వ బహుమతి ఐరన్ బాక్స్ గెలుపొందిన మహిళలకు బహుమతులు ఇవ్వబడును. అని తెలిపారు