
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో అన్నాభావు సాటే విగ్రహం ఏర్పాటు చేస్తానని హామీతానూర్ మండలం బొంద్రట్ గ్రామంలో అన్నాభావు సాటే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గైక్వాడ్ గంగాధర్ పాల్గొని, బొంద్రట్ గ్రామంలో మహనీయుడు అన్నాభావు సాటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.అన్నాభావు సాటే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చిన గైక్వాడ్ గంగాధర్ కు గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, అన్నాభావు సాటే అభిమానులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.