
పయనించే సూర్యుడుD.6.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్.బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలంలో తాళ్ల రాంపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో సోమవారం చిన్నారులకు ఉచిత యూనిఫాముల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గ్రామ సర్పంచ్ పావని భానుచందర్ చేతులు మీదుగా చిన్నారులకు యూనిఫామ్ లను అందజేశారు అలాగే చిన్నారుల ఎత్తు బరువులను కొలిచి వారి పోషకాహారం స్థితులను గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు వర్షాకాలంలో ప్రభాలే సీజనల్ వ్యాధుల గురించి వాటి నివారణలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ పావని భానుచందర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడి టీచర్ అనురాధ డాక్టర్ దయానంద్ గ్రామపంచాయతీ కారోబార్ తదితరులు పాల్గొన్నారు