పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 బాల్కొండ నిజ వర్గ ప్రతినిధి ఎల్ లింబాద్రి
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎరుగట్ల మండలం అఖిలభారత ఐక్య రైతు సంఘం వి ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
రాచరిక వ్యవస్థను మరిపించే విధంగా తాళ్ల రాంపూర్ గ్రామ మహిళలను అవమానపరిచి గుడి నుంచి నెట్టి వేయడం పై కఠిన చర్యలు తీసుకోవాలి…
గ్రామాభివృద్ధి కమిటీ ముసుగులో పెత్తందారీ వర్గం రెండు రెక్కల ఆస్తిగా పనిచేసుకొని జీ విస్తున్న చేతి వృత్తుల వారిపై గ్రామ అభివృద్ధి కమిటీ ముసుగులో పెత్తందారీ వర్గం బీసీలు.. దళిత.. మైనార్టీ ప్రజలపై,, తమ ఆదేశాలను పాటించడం లేదని సాంఘిక బహిష్కరణ వేటు వేసి అవమానపరచడమే కాకుండా,,, చేతివృత్తులను చేసుకుంటున్నా మహిళల్ని బీడీ కార్ఖానాల్లో చట్టబద్ధంగా అన్ని హక్కులు ఉన్న వారికి ఉపాధి ని అడ్డుకోవడం… దీనికి ఉదాహరణగా గతంలో కమ్మరి పల్లి మండల పరిధిలో ఆశ కో త్తూరులో వందలాదిమంది బీడీ కార్మికులకు ఉపాధిని అడ్డుకున్నారు.. వీడీసీపై ఫిర్యాదు చేయగా ఉప సవరించుకున్నారు…
ఈ నేపథ్యంలో ఏరుగట్ల మండల పరిధిలో తాళ్లరాంపూర్ గ్రామంలో 67 గీతా కార్మిక కుటుంబాలు వీడిసి ఆజ్ఞ మేరకు లక్షలాది రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చారు.. ఆర్థికంగా మేము ఇంత భారాన్ని మోయలేమని తగ్గించండి అని వేడుకోగా మా తీర్పు ఎదురులేదని గ్రామంలో ఎవరు కల్లు తాగడానికి వీలులేదని… లక్షలాది రూపాయలు చెల్లించలేని స్థితిలో తాటి చెట్టు.. ఈత చెట్లను ఈత చెట్లను గ్రామానికి గొప్ప చెప్పండని బయట నుంచి గీతా కార్మికుల్ని తెప్పించి మేమే ఆ వృత్తిని చేపిస్తామని ఆదేశించడం అసహ్యించుకుంటుంది.. పోలీసులకు ఫిర్యాదులు గత ఆరు నెలల క్రితం చేశారు.. అయినా ఏ ఒక్కరిని కళ్ళు తాగినీయకుండా అడ్డుకోవడమే కాకుండా,, చుట్టుపక్క గ్రామాలనుంచి సైతం కళ్ళు తాగడానికి వచ్చేవారిని దారి కాచి వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నీరు మార్చడం అవుతుందని అన్నారు. శ్రీరామనవమి రోజున తాళ్ల రాంపూర్ గ్రామ గీతా వృత్తి చేసుకుంటున్న కుటుంబాల మహిళలు పూజలు చేస్తుండగా మీకు సాంఘిక బహిష్కరణ విధించామని ఈ గుడి నుంచి వెళ్లిపోవాలని,,, మీరు పూజలు చేసుకునే హక్కు మీకు లేదని పూజారి చేత ఆదేశం చేయించారు.. మహిళలు అవమానంతో గో డుగోడుని ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు.. రాజశేఖర్ వ్యవస్థను మరిపించే విధంగా తాళ్ల రాంపూర్ విడిసి చర్య ఉందని.. భావిస్తున్నాం…(గౌడ కుటుంబాలు) వి డి సి మూసుగు లో పెత్తందారులు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు.. వీరిపై చర్య తీసుకోవాలని గీతా కార్మిక సంఘం.. అఖిలభారత ఐక్య రైతు సంఘం 8 ఏప్రిల్ రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారులు కలవడానికి వందలాది మంది మహిళలు… కార్మికులు వెళ్లి సి పి అందుబాటులో లేకపోవడంతో ఇంచార్జ్ అధికారికి ఫిర్యాదు చేసి రావడం జరిగింది.. దీంతోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్లి జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు చేసి రావడం జరిగింది… వి డీసీ ముసుగులో ఉన్న పెత్తందారు నలుగురిపై పూజారిపై చర్య తీసుకోని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గీత కార్మిక సంఘం నాయకుడు.. రామ గౌడ్… ప్రభాకర్. దేగాం యాద గౌడ్… దేవారం.. అవమానానికి గురైన మహిళలు… ఓ డబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు.. వి సత్యవ్వ.. మోకు దెబ్బ నాయకులు అరుణ్ గౌడ్… తదితరులు పాల్గొన్నారు..