త్వరలో తిన్మార్ మల్లన్న షాద్ నగర్ రాక
( పయనించే సూర్యుడు మే 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ఈరోజు క్యూ న్యూస్ కార్యాలయంలో బీసీ ఉద్యమ పోరాట స్ఫూర్తి ఎంఎల్సీ తిన్మార్ మల్లన్నని బీసీ సేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీసీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న రాజకీయ వైఖరులు, అన్యాయాలు, అభివృద్ధిలో బీసీలకు తక్కువ ప్రాధాన్యం వంటి కీలక అంశాలపై ముక్త కంఠంతో చర్చ జరగింది.ఈ నేపథ్యంలో బీసీ పొలిటికల్ జేఏసి కోఆర్డినేషన్ చైర్మన్ హరిశంకర్ గౌడ్ , బీసీ జేఏసి నాయకుడు మదర్ నర్సయ్య గారు, రంగారెడ్డి జిల్లా బీసీ సేన ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ , యువత అధ్యక్షులు దేశమోని శివ ముదిరాజ్ , షాద్నగర్ అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్ర శేఖర్ అప్ప బల్వీర్ సింగ్ తిన్మార్ మల్లన్న తో మాట్లాడుతూ షాద్ నగర్ బలంగా బీసీ ఉద్యమం పెరుగుతుందన్న అన్న బీసీ ల దగ్గరకు వెళ్లి మాట్లాడుతున్నాం స్పందన చాలా బాగుంది బీసీలు సహనం కోల్పోతున్నారు. రాజకీయాల్లో మన స్థానాన్ని మనమే పోరాడి సాధించుకోవాలి. కోరికలతో కాదు, పోరాటంతో మాత్రమే బీసీ రాజ్యం వస్తుంది.అని అన్నారు తిన్మార్ మల్లన్న కూడా ధైర్యంగా స్పందిస్తూ – “మీరు నిజమైన బీసీ సైనికులు. మీరు చేస్తున్న పోరాటం చూస్తుంటే గర్వంగా ఉంది. ఎప్పుడు, ఎక్కడ మీకు అండగా ఉండాలో చెప్పండి. మీరు మీటింగ్ ఏర్పాటు చెయ్యండి తప్పకుండా వస్తాను. ఇక మీదట మన వర్గాన్ని చైతన్యం చేసి, రాజకీయ శక్తిగా నిలబెడదాం. బీసీల రాజ్యం మనం సాధించాల్సిందే!” అంటూ ఉత్సాహాన్నిచ్చారు.కచ్చితంగ షాద్ నగర్ త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి తిన్మార్ మల్లన్నని పిలిపిస్తామని వారు అన్నారు