
పయనించే సూర్యుడు జనవరి 16,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
తిరుపతిలోని తిరుచానూరులో వెలసిన శ్రీ పద్మావతి అమ్మవారికి టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన భార్య బైరెడ్డి భారతమ్మ, కూతురు బైరెడ్డి శర్వాణిలు కుటుంబ సమేతంగా శుక్రవారం కుంకుమార్చన, విశేష పూజలు చేసి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీ టీ డి అధికారులు, అర్చకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి కుంకుమ, తీర్థ ప్రసాదం అందజేసి శేష వస్రం, పూలమాలతో సన్మానం చేశారు.
