
పయనించే సూర్యుడు డిసెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
తిరుపతి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ స్టేట్ కబడ్డీ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 21 (ఆదివారం) నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ (కర్నూలు, డిసెంబర్ 26–28) కోసం జిల్లా/రాష్ట్ర జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు.ట్రయల్స్ మధ్యాహ్నం 2 గంటలకు సూళ్లూరుపేట హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతాయి.అర్హత కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, స్పోర్ట్స్ కిట్‌తో సమయానికి హాజరుకావాలని సూచించారు.అసోసియేషన్ నియమించిన అర్హత కలిగిన సెలెక్టర్లు ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తారని అధ్యక్షుడు ఎం.సుమన్, కార్యదర్శి పి.శ్రీకాంత్ తెలిపారు.
