తిరువూరు పట్టణంలో దీర్ఘకాలికంగా ప్రధాన సమస్యగా మారిన బస్టాండ్- తోకపల్లి సూర్య రెస్టారెంట్ రహదారికి మోక్షం. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.ఎన్నో ఏళ్లుగా నిత్యం వేలాదిమంది ప్రజలు ఈ రహదారిలో ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు.ప్రతిరోజు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి భద్రాచలం పుణ్యక్షేత్రానికి బస్సులు,భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి వర్షాకాలంలో మోకాళ్ళ లోతు గోతుల్లో భారీ వాహనాలు, స్కూల్ బస్సులు దిగబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి..ఎట్టకేలకు ఎమ్మెల్యే కొలికపూడి తీసుకున్న ప్రత్యేక చొరవతో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపిన-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్..పట్టణంలో ఉన్న ఐదు,ఆరు సమస్యల్లో ప్రధానంగా ఈ రోడ్డు ఉందన్నారు- ఎమ్మెల్యే కొలికపూడి..త్వరలో రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తీర్చనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు..