తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడులు. పయనించే సూర్యుడు ఫిబ్రవరి 15 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ.ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె.వి. సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల చంద్రపట్లతండా కలగర గ్రామాలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జె.శ్రీనివాస రావు, బాణవత్తు కోటేశ్వరరావుల వద్ద 100 లీ.ల బెల్లపు ఊట ను ధ్వంసం చేసి, 14 లీ. ల సారాను స్వాధీన పరుచుకొని వారిని అదుపులోనికి తీసుకొని కేసు నమోదు చేసి తిరువూరు స్టేషన్ కి అప్పగించారు.ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎం. రామ శేషయ్య, కె.మధు హెచ్ సి బి.సుబ్బారావు హెచ్ సి లు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.