పయనించే సూర్యుడు మార్చి 12 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.
మల్లెల శ్రీ నన్నక నరేంద్ర ధనలక్ష్మి మెమోరియల్ జడ్పీ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థుల ప్రభంజనం 34వ కృష్ణాజిల్లా కబడ్డి అసోసియేషన్ ఆధ్వర్యం లో నిర్వహించిన సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలకు శ్రీ నన్నక నరేంద్ర ధనలక్ష్మీ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మల్లెల విద్యార్థినీ విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేముల శ్రీధర్ గారు తెలియజేశారు. ఈ నెల 7వ తేదీన న జడ్.పి.హెచ్.ఎస్మొవ్వ లో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టుకు కంప వైష్ణవి, నాళ్లా విజయతేజశ్రీ, గోపిదేశి చైతన్య ఎంపికైనందుకు ఈరోజు ఉదయం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారిని, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు సపావటు కృష్ణ ప్రసాద్ నాయక్ గారిని అభినందించారు. ఈ క్రీడాకారులు ఈ నెల 14,15,16 న వైఎస్ఆర్ కడప జిల్లా, పులివెందుల లో జరిగే రాష్ట్ర స్థాయి జట్టు లో పాల్గొని పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.