పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 8
అల్లూరి సీతారామరాజు జిల్లా లో 2025 ఏప్రిల్, మే, నెలలలో చింతూరు డివిజన్ వ్యాప్తంగా తునికాకు కార్మికులు ఆకు సేకరణ సేకరించి రెండు నెలలు పూర్తయిన నేటికీ డబ్బులు చెల్లించకపోవడం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి అని తక్షణమే తునికాకు కార్మికులకు ఆకు సేకరణకు డబ్బులు చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్ డిమాండ్ చేశారు మంగళవారం నాడు చింతూరు సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్ మాట్లాడుతూ తునికాకు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు గిరిజనేతరులకు రెండవ పంటగా ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న తునికాకు సేకరణను మరియు కార్మికులకు డబ్బులు చెల్లించే విధానంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఈ ఏడాది ఏప్రిల్, మే, నెలలో తునికాకు సేకరణ సేపటి రెండు నెలలు పూర్తయిన కార్మికులకు కట్టకు ప్రభుత్వం చెల్లించే 3 90, పైసలు చెల్లించే డబ్బులను నేటికీ కార్మికులకు అందించలేదని తునికాకు కాంట్రాక్టర్లు తమ సుమికాకు సేకరణ కల్ల ల వద్ద చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా వారి డబ్బులు వారి చెల్లించారు కానీ ప్రభుత్వం చెల్లించవలసిన డబ్బులు మాత్రం చెల్లించకపోవడం కార్మికులను ఆందోళనకు గురిచేస్తుంది, కార్మికులు తమ వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం పని చేస్తే తునికాకు కల్లాల వద్ద చెల్లించవలసినటువంటి డబ్బులను రెండు మూడు నెలల నుండి ఎందుకు చెల్లించడం లేదని కాంట్రాక్టుల వద్ద నుండి రాయల్టీ పేరు మీద కట్టించుకున్న డబ్బులు ఏమవుతున్నాయని ఈ సందర్భంగా ప్రశ్నించారు అంతేకాకుండా 2012 నుండి తునికాకు బోనస్ డబ్బులు పెండింగ్ ఉన్నాయని కంటితోడుగా 2021 బోనస్ మాత్రమే చెల్లించారని కార్మికుల కష్టా జీతాన్ని తునిగాకు బోనస్‌ను తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, ఏప్రిల్ మే మాషాలలో మండుటెండలో, వడదెబ్బలు, అనారోగ్యాలను మరియు అడవి జంతువుల భయాందోళన మధ్య ప్రజానీకం తునికాకు సేకరిస్తే కాంట్రాక్టర్ల వద్ద నుండి రాయల్టీ పేరు మీద డబ్బులు తీసుకుని ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అంతేకాకుండా తునికాకు సేకరణ గాని టెండర్లు గాని నిర్లక్ష్యం ఫలితంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని రాబోయే రోజుల్లో తునిక కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తునికకు డబ్బులు చెల్లించకపోతే డివిజన్ డిఎఫ్ఓ కార్యాలయాన్ని స్థానిక ఐటిడిఏ ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు పోడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, పట్రా రమేష్, వీరబోయిన దిలీప్ తదితరులు పాల్గొన్నారు