
తుమ్మలపల్లిలో రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ జాతరలు స్థానిక సంస్కృతికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
రథోత్సవం లో పాల్గొన్న చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసు .
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 06.
నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రాల నడుమ స్వామివారి రథోత్సవం, ప్రత్యేక పూజలతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసు పాల్గొన్నారు.
తుమ్మలపల్లిలోని శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం విమాన రథోత్సవం వైభవంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. రథాన్ని లాగేందుకు యువకులు పోటీపడ్డారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
