పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు(
టేకులపల్లి మండలం వెంకట్యతండా గ్రామానికి చెందిన తులికశ్రీ కాబోయే భర్త వేధింపులతో ఆత్మ హత్యకు పాల్పడిన సమాచారం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య వారి నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులు ఓదార్చి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ - ఉమా ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, భూక్యా సర్దార్, బానోత్ రవి,తదితరులు పాల్గొన్నారు.