// పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20//మక్తల్
పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైన తెలంగాణ పోరాట యోధులను స్మరించుకుంటూ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ అమరవీరులు మనందరికీ స్ఫూర్తిదాయకమని అట్లాంటి గొప్ప త్యాగాలు కలిగిన మనుషులను గుర్తు చేసుకుంటూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మందికి ప్రాణదాతలుగా మిగిలిపోయే గొప్ప అవకాశం లభిస్తుందని అన్నారు మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు 120 రోజులకు ఒకసారి చనిపోయి మళ్లీ పునరుద్ధరించబడతాయని కాబట్టి తప్పనిసరిగా ప్రతి మనిషి రక్తదానం చేయడం బాధ్యతగా స్వీకరించాలని కోరారు ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 35 మంది దాకా యువకులు హాజరై రక్తదానం చేయడం అభినందనీయమని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.పుడమి ఫౌండేషన్ పర్యావరణాన్ని కాపాడడం తో పాటు మానవత్వాన్ని నిలబెట్టడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని దేశంలోని యువత పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని ఆ క్రమంలో పుడమి ఫౌండేషన్ మీ అందరి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలియజేశారు.
ఫౌండేషన్ చైర్మన్ జె. వెంకటపతి రాజు రవికుమార్ ఫౌండేషన్ అధ్యక్షులు, పేట పవన్ కళ్యాణ్ కార్యవర్గ సభ్యులు