-ఉద్యమకారుల ఫోరం ఇల్లందకుంట మండల శాఖ..
పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 22 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద పోస్ట్ కార్డు ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.ముఖ్యమంత్రి కి ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలని 100 పోస్ట్ కార్డులు పంపడం జరిగింది.ఈ సందర్భంగా టఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఉద్యమాలకు స్థానం కల్పించి గౌరవించిందని, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యకారులు చేసిన పోరాటాలు, త్యాగాల వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిందని అన్నారు. అలాంటి ఉద్యమ కారులను గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యమకారులకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని వెంటనే హామీలను అమలు చేయాలని కోరారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి, 25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డులు, ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన ఉద్యమకారుల ఆకాంక్షను నెరవేర్చవలసిన అవసరం ఉన్నదని పోస్టుకార్డు ఉద్యమం ద్వారా గుర్తు చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో టఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కో కన్వీనర్ అన్నం ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మూడెడ్ల కుమారస్వామి, మండల అధ్యక్షులు రావుల రాజబాబు, నాయకులు ఆరే రమేష్ రెడ్డి, టఫ్ నాయకులు పెద్ది కుమార్, వీరారెడ్డి, రాజిరు, సమ్మయ్య, రాజేందర్, రాజయ్య,వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, భిక్షపతి, శివ, దిలీప్, సుమన్, అజయ్, శ్రీకాంత్, రాజు, గణేష్, టఫ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.