
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 20 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
గ్రామీణ ఆరోగ్యం మరియు వైద్య సేవా దాతృత్వం విభాగంలో తెలంగాణ గవర్నర్ విశిష్టత పురస్కారం 2025ను అందుకున్న గర్వకారణమైన సందర్భంగా రామ్‌దేవ్ రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సింగ్ కళాశాల మైదానం లో నిర్వహించిన సన్మాన విందు కార్యక్రమానికి డా. ఎన్. యోబు ఆహ్వానం మేరకు హాజరై శాలువుతో సత్కరించి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ రవీందర్, అర్జున్, భాను తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం గ్రామీణ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో, అవుట్‌రీచ్ కార్యక్రమాలు నిర్వహించడంలో, నివారణాత్మక చర్యలు అమలు చేయడంలో మరియు కరుణతో కూడిన వైద్య సేవలను అందించడంలో నిరంతర కృషికి లభించిన గౌరవప్రదమైన గుర్తింపుగా నిలిచింది అని కొనియాడారు.