పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 (పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పి ఓ తన ఛాంబర్ లో డిగ్రీ కళాశాలల అడ్మిషన్లకు సంబంధించిన ఫ్లెక్సీలు మరియు వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బిఎస్సి లైఫ్ సైన్స్, బీకాం సీఏ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నవని, ఈ కళాశాలలో చేరగోరు మహిళలకు విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు బెడ్ షీట్లు బట్టలు మరియు ఉచితంగా నిత్యవసర సరుకులు, క్లాస్ రూములు, పాఠ్య పుస్తకాలు ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రత్యేక సిబ్బంది, 24 గంటలు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం జరుగుతుందని అన్నారు. తప్పనిసరిగా మహిళలు విద్యార్థినీ విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకులం ఆర్సీవో నాగార్జున రావు, ఖమ్మం, దమ్మపేట, కొత్తగూడెం, మణుగూరు కళాశాలల ప్రిన్సిపాల్ లు రజిత, రజిని, స్పందన, సంగీత, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు