పయనించే సూర్యుడు. మార్చి 4. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం మహిళా దినోత్సవం 2025 వేడుకలు పోస్టర్ ను శ్రీ ముజామిల్ ఖాన్ ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ గారు, కలెక్టరేట్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి జి ఉషశ్రీ కార్యదర్శి పి సుధారాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీవో జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ గారు కార్యదర్శి మోదుగు వేలాద్రి గారు ట్రెజరర్ కే శేషు ప్రసాద్ గారు హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరంపల్లి రాంబాబు గారు హాజరయ్యారు.
మార్చి 8 వ తారీకు ఉదయం 10:00 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ క్రీడల పోటీ కార్యక్రమాలు ఉంటాయని జిల్లాలోని గెజిటెడ్ అధికారులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా గెజిటెడ్ అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళలు జిల్లాలో వివిధ విభాగాలలో సమర్థవంతంగా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు వై మంజుల సంయుక్త కార్యదర్శి, కె విజయలక్ష్మి ఆర్గనైజింగ్ సెక్రటరీ, బి శారద పబ్లిసిటీ సెక్రటరీ, ఆశాలత డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్, కళావతి బాయ్ డిఎం అండ్ హెచ్ ఓ, రాజేశ్వరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అరుణ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పద్మశ్రీ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్, జి జ్యోతి బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎన్ మాధవి ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, డి పుష్పలత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ, ఎన్ విజయలక్ష్మి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్, ఎన్ కనకదుర్గ, బి నాగేంద్ర కుమారి, ప్రమీల, డి సుజాత, లావణ్య, వాణిశ్రీ, వాసవిరాణి, ఉదయశ్రీ, చంద్రకళ, నాగమణి, జోష్ణ, వీరభద్రమ్మ, విజయ్ కుమారి, సరళ దేవి, నాగమణి, ప్రమీల, రమాదేవి, అనిత, సుమ మాధురి, కృష్ణకుమారి మరియు మహిళా గెజిటెడ్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.