
పయనించే సూర్యుడు, నవంబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్‌ను రాష్ట్ర అధ్యక్షులు సంపత్ ప్రకటించారు. ఈ సందర్భంగా వినయ్‌కు నియామక పత్రాన్ని టిడిపిఎస్ నేతలు అందజేశారు.
తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర నాయకులకు సహకారం అందించినందుకు వినయ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దళితుల హక్కులు, సంక్షేమం, సమాజాభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని ఆశ్వాసం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు నగేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అనిల్, తోగుట మండల అధ్యక్షుడు బాలరాజు, కొండపాక శంకర్, సుమన్, వినోద్, నవీన్, హరి, అనిల్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.