పయనించే సూర్యుడు న్యూస్// 5 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా
ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్ యూనియన్ రాష్ట్ర రెండోమాసభల్లో కోటకొండ గ్రామానికి చెందిన నరసింహ కరోబార్ ను రెండోసారి రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్న రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రంలో గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యల మీద ఎప్పుడు పోరాడుతూ వారి సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని అన్నారు