ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి
అక్రమ మద్యం అమ్మకాలు జరిపితే సహించేది లేదని ఎక్సైజ్ సీఐ అశ్రపున్నిసా బేగం ఘాటుగా హెచ్చరించారు కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో తెలంగాణ నుంచి అనధికారకం గా మధ్యము తీసుకువచ్చి అమ్మకాలు జరుపుతున్న షేక్ మహమ్మద్ రసూల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుండి 481మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.