పయనించే సూర్యుడు ఏప్రిల్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమార్ అనంతన్ వయ సు తొంబై ముడు సంవత్సరాలు ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో కన్ను మూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుమారి అనంతన్.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 1977లో నాగర్ కోయిల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతన్ ఐదుసార్లు తమిళనాడు అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. అనంతన్ తమిళ రచ యితగా, ప్రముఖ వక్తగా, రాజకీయ నేతగా ఎనలేని ముద్రవేసుకున్నారు. కుమా రి, అనంతరం మృతిపట్ల తమిళిసై సౌందరరాజన్ తోపాటు.. పలువురు నేతలు నివాళులర్పించారు. సాలిగ్రామంలోని ఆయన కుమార్తె ఇంటి దగ్గర అంతిమ నివాళులర్పిం చడానికి అనంతన్ భౌతికకాయాన్ని సందర్శన కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి