
{పయనించే సూర్యుడు} {నవంబర్4}మక్తల్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు మక్తల్ పట్టణ కేంద్రంలో స్థానిక మంత్రి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు నరహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన పీజురీయంబర్స్ మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ గత ఆరేళ్ల నుండి ప్రభుత్వం చెల్లించడం లేదు. 2023-2024 - విద్యాసంవత్సరం 2100కోట్లు, 2024-2025 విద్యాసంవత్సరం -2100 కోట్లు 2025 2026 -విద్యాసంవత్సరం 2200 కోట్లు మొత్తం 6,300 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి విద్యార్థులకు ఇవ్వాలసిన ఫీజులు, అలాగే గత ప్రభుత్వం హయంలో 4100 కోట్లు బకాయిలు ఉన్నాయి. మొత్తం 10,500 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిలో దసరా కంటే ముందు ప్రభుత్వం యాజనూన్యాలు సమ్మె సందర్భంగా చర్చలు జరిపి దసరాకు - 800 కోట్లు దీపావళి-900 కోట్లు నవంబర్ నెలలో -300 మొత్తం 1200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వాటిలో 300కోట్లు -చెల్లించారు. మిగతా బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా విద్యార్థులే ఫీజులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలలో, హస్టల్స్ ఫీజులను కూడా వారే చెల్లిస్తున్నారు. ఇంకో ప్రక్క ప్రైవేటు యాజమాన్యాలు కూడా వారి ఇబ్బందులు రీత్యా సమ్మెలోకి వెళ్ళాలి. కావున మీరు ప్రభుత్వంతో చర్చించి భోజులను విడుదల చేయించేలాగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, మహేందర్, చింటూ పాల్గొనడం జరిగింది.
