పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ బాల్కొండ ప్రతినిధి కే లింబాద్రి
నిజామాబాదు (ఏప్రిల్ 30):నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కు చెందిన రాజుల రామనాధం, గ్రామము వన్నెల బి తెలంగాణ రాష్ట్ర ఏ.ఐ.సీ.డబ్ల్యూ.సీ ప్రధానకార్యదర్శిగా నియమించడం జరిగింది.జాతీయ వినియోగదారుల సమాఖ్య ఏ.ఐ.సీ.డబ్ల్యూ.సీ(ఆల్ ఇండియా కన్సుమారు వెల్ఫెర్ కౌన్సిల్) చైర్మన్ విఖ్యత్ షేనాయ్, ప్రిన్సిపాల్ జనరల్ సెక్రెటరీ దేవేంద్ర తివారి లకు కృతజ్ఞతలు తెలిపారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు కు చెందిన రాజుల రామనాధం, తెలంగాణ రాష్ట్ర ఏ.ఐ.సీ.డబ్ల్యూ.సీ ప్రధానకార్యదర్శిగా తనను నియమించినదుకు. గత పన్నెండు సంవత్సరాలుగా వినియోగదారుల ఉద్యమంలో చురుకుగా సేవలందిస్తున్న తనకు రాష్ట్రస్తాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఏ.ఐ.సీ.డబ్ల్యూ.సీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రతినిధ్యం కలిగి, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు తో పాటు నీతీ ఆయోగ్, బ్.ఐ.యస్ ల గుర్తింపు ఉన్న ఏకైక జాతీయ వినియోగదారుల సమాఖ్యగా గుర్తింపు పొందిన ఇందులో తనకు రాష్ట్రస్తాయి గుర్తింపు లభించడానికి కృషి చేసిన జాతీయ నాయకులు మొగిలిచెర్ల సుదర్శన్, పల్లెపాడు దామోదర్, సాంబరాజు చక్రపాణి, దొంతి శిల్పా రెడ్డి లతో పాటు ఇందూర్ కన్జ్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు, పెందొట అనిల్ కుమార్, సీసీఐ రాష్ట్ర కార్యదర్శి సందు ప్రవీణ్, వినియోదరుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వర్మ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు అనిల్ లకు కృతజ్ఞతలు తెలియ చేశారు. వినియోగదారుల ఉద్యమ చైతన్యం పట్టణాలకే పరిమితమైన నేపథ్యం లో గ్రామీణ స్థాయి లో విస్తృతపరిచే లక్ష్యం తో పనిచేస్తున్న ఏ.ఐ.సీ.డబ్ల్యూ.సీ. లో తన గుర్తింపు తన బాధ్యత ను పెంచడమే కాకుండా గ్రామీణ వినియోగదారులకు సేవాలందించే చక్కటి అవకాశం లభించిందని అన్నారు రామనాధమ్. త్వరలో తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల కమిటీల ఏర్పాటుతో ఏ.ఐ.సీ.డబ్ల్యూ.సీ ని విస్తృత పరుస్తామని అన్నారు