
నిజాంబాద్ నుండి హైదరాబాద్ మీదుగా లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సుకు కొత్త బోర్డింగ్ పాయింట్లు.
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.నిజామాబాద్ ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నిజామాబాద్-హైదరాబాద్ - బెంగళూరు లహరి ఏసీ సీటర్ & స్లీపర్ సర్వీసుకు కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి తెలిపారు.బెంగళూరు ప్రయాణికుల అభ్యర్ధన మేరకు హైదరాబాద్ నగరంలో లహరి ఏసీ సీటర్ & స్లీపర్ సర్వీసుకు మెడ్చల్, కొంపల్లి, జే.బీ.ఎస్, ఎం.జీ.బీ.ఎస్. ఆరాంఘర్ "ఎక్స్" రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా లహరి సర్వీసును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.అదేవిధంగా, బెంగళూరు నుండి నిజామాబాద్ వచ్చే (డౌన్) సర్వీసుకు పిణ్య, యశ్వంత్పూర్, ఆనంద్ రావు నగర్, ప్యాలెస్ గుట్టహళ్లి, సి.బీ.ఐ - జంక్షన్, బెంగళూరు - విమానాశ్రయం "X" రోడ్ కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణ మూర్తి మాట్లాడుతూ, ప్రయాణికులకు మరింత నాణ్యమైన, సౌకర్యవంతమైన మరియు సమయపాలనతో కూడిన సేవలను అందించడం టీజీఎస్ఆర్టీసీ లక్ష్యమని తెలిపారు. ఈ కొత్త బోర్డింగ్ పాయింట్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని లహరి ఏసీ సీటర్ & స్లీపర్ సర్వీసులను ఆదరించాలని తెలుపుతూ, ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ వెబ్ సైట్ www.tgsrtcbus.in ద్వారా లేదా రిజర్వేషన్ కౌంటర్ నందు కూడా టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం కలదని తెలిపారు.