పయనించే సూర్యుడు ,జనవరి 17,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్... తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరణ సారపాక పార్టీ కార్యాలయం లో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సి,పి,ఐ,ఎం, 4 వ తెలంగాణ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జిల్లాలో జనవరి 25 నుండి 28 వరకు జరుగుతున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్లను ఆవిష్కరణ చేయటం జరిగింది .తెలంగాణ రాష్ట్రంలో మూడు సంవత్సరాల పాటు చేసిన పోరాటాలు అనుభవాలని ఎదురైన సవాలను ఎదుర్కొని సమస్యల్ని మహాసభలో చర్చించబోతున్నారు రానున్న మూడు సంవత్సరాల కాలంలో పోరాటాలు ఉద్యమాలని పోరాటాలు ఆందోళన చేయాలని మహాసభలో తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పైన మోపుతున్న భారాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల పైన భారాలు మోపుతూ రైతులు పై బారాలు మోపుతూ పండిన పంటకు గిట్టుబాటు రేటు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్ని పూర్తిగా అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం పై మహాసభలో తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది ,ప్రజల పక్షాన నిరంతరం పోరాడాలని మహాసభలో జాతీయ నాయకులు రాష్ట్ర నాయకత్వం పోరాటంలో పోరాడిన ప్రజల పక్షాన సమస్యల పైన నిరంతరం పనిచేస్తున్న నాయకులకు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునివ్వబోతున్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు భయ్యా రాము పాండవుల రామనాథం ఎస్.కె అబీద ,లక్ష్మి, మేడి ప్రభాకర్ , గడిదేశీ నాగేశ్వరావు, కనితి నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.