పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 13 నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట గోపాల్ రెడ్డి రిటైర్డ్ ఎంఈఓ బాల గంగాధర్ ను తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు నుంచి నాకు తెలుగుదేశం పార్టీ తో అనుబంధం ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుడుగా ఉన్నాను. అయితే ఇప్పుడు పదవి విరమణ పొందినాక సమయం ఉంది కాబట్టి ఈనాటి రాజకీయ పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ యొక్క విలువలు కలిగిన పార్టీ నారా చంద్రబాబునాయుడు గారి విజినరీ అభివృద్ధి మరియు సంక్షేమంపాటుపడుతున్నటువంటి క్రమంలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. బోధన్ నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పార్లమెంటరీ ఇంచార్జ్ దేగం యాదగౌడ్ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు హనుమంతరావు పావులూరి వెంకటేశ్వరరావు బొబ్బ నరసింహారావు రమేష్ ముమ్మనేని సాయిబాబా రావెల శ్రీనివాస్ కృష్ణారెడ్డి భాస్కర్ సచిన్ పటేల్ విట్టల్ పటేల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.