పరామర్శించిన బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్
( పయనించే సూర్యుడు మార్చ్ 28 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ళ యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ గారు వారి స్వగృహానికి వెళ్ళి, పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశి, ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.