
పయనించే సూర్యుడుD.2.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్..ఏర్గట్ల మండలం తోర్తి గ్రామం లోని తోర్తి -1 అంగన్వాడి కేంద్రంలో గురువారం చిన్నారులకు ఉచిత యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్, ఉప సర్పంచ్ బోల్లపల్లి సుమన్ గౌడ్ చేతుల మీదుగా చిన్నారులకు యూనిఫాంలను అందజేశారు. అలాగే చిన్నారుల ఎత్తు బరువులను కొలిచి, వారి పోషకాహార స్థితులనుగురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించారు.వర్ష కాలంలో ప్రభలే సీజనల్ వ్యాధుల గురించి వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆశ వర్కర్లు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, సురక్షితమైన తాగునీరు వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ఆశ వర్కర్లు కరుణ, సుశీల ,అంగన్వాడీ కార్యకర్త ప్రేమ లత,లబ్ధిదారులు,వీడిసి సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.