పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : తొలగించిన వికలాంగుల పెన్షన్లు త్వరగా పునరుద్ధరించాలని విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు మండలాల్లో తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దచాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మెడికల్ వెరిఫికేషన్ లో అనేక మంది వికలాంగులకు అన్యాయం జరిగిందని అన్నారు. పెన్షన్ రద్దయిందని నోటీస్ ఇవ్వడం జరిగిందని, ఈ నోటీస్ ను వెనక్కి తీసుకోవాలని మరలా రీ అసెస్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల కుటుంబాలు పెన్షన్ మీద ఆధారపడి ఉన్నాయని, కావున తొలగించిన పింఛన్లు వెంటనే పునరుద్దరించి వారి జీవితంలో వెలుగులు నింపాలని కోరారు. పుల్లంపేట అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి మాట్లాడుతూ డాక్టర్లు చేసిన తప్పిదమో లేక ప్రభుత్వం చేసిన తప్పిదమో అర్థం కాక దివ్యాంగులు మనోవేదనకు గురవుతున్నారని, అవిటితనం వికలాంగులకా., లేకా కనిపించి కూడా వికలత్వం నిర్దారించలేని డాక్టర్లకా అని ఏద్దేవా చేశారు. వెంటనే పెన్షన్ను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పింఛన్లు పునరుద్ధరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం నాయకులు వెంకటప్రసాద్, నరసింహులు, వహీద్, పెనగలూరు అధ్యక్షుడు తిరుపాల్, తిరుమల్ రెడ్డి, నందలూరు అధ్యక్షులు శివకోటి తదిరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్ : ఏవో కు వినతిపత్రం సమర్పిస్తున్న వికలాంగులు