ఇందిరమ్మ ఇండ్లకు ఏ ఒక్కరూ రూపాయి కట్టనవసరం లేదు.
నూగూరు వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్. పూనెం రాంబాబు.
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 19; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకై ప్రతిష్టాత్మకంగా నిర్మించే గృహ నిర్మాణ పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఈ యొక్క పథకంలో అర్హులైనటువంటి పేదలకి రాష్ట్ర ప్రభుత్వం 5లక్షల వ్యయంతో గృహాలు నిర్మించాలని నిర్ణయించిన సంగతి రాష్ట్ర ప్రజల అందరికీ తెలిసినదే. కాగా ములుగు జిల్లా వాజేడు మండలంలో కొంతమంది వ్యక్తులు కూడి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని పల్లెలోని ప్రజలు సగుసలాడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూగూరు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పూనెం రాంబాబు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. నూగురు వ్యవసాయ శాఖ మార్కెట్ వైస్ చైర్మన్ పూనెంరాంబాబు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం డబ్బులు ఇవ్వండి అని అడిగే దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని పత్రికా ముఖంగా తెలియజేశారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు మాత్రమే చెందుతాయని, డబ్బులు ఇచ్చి మోసపోకూడదని తెలిపారు. భద్రాచల నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని భద్రాచలం నియోజకవర్గం లో ఐదు మండలాలు ఉండగా ఒక్కో మండలానికి 700 ఇండ్ల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుందని అవి కూడా విడతల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వ అందచేస్తుందని అన్నారు. తొందరపడి దళారులు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోకూడదని తెలిపారు. అంతేకాకుండా పార్టీ కట్టుబాట్లకి విరుద్ధంగా పనిచేసే నాయకులపై ,కార్యకర్తల గూర్చి అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్తామని, అవసరమైతే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ప్రజలు ఎవరు అధైర్య పడకూడదని తెలియజేశారు.ఇది కేవలం ప్రజలకు మాత్రమే ప్రభుత్వం అని ప్రజలకు మాత్రమే అండగా ఉంటుందని ఇది ప్రజా ప్రభుత్వం అని,దళారులకు కొమ్ముకాసే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేశారు.