అంబేద్కర్ యువజన సంఘం మక్తల్
//పయనించే సూర్యుడు //జులై 11//
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో* గురువారం నాడు హైదరాబాద్ లోని ఎస్సీ ఎస్టీ కమిషన్ మరియు మానవ హక్కుల కమిషన్లకు దళిత యువకుడిని కులం పేరుతో దూషిస్తూ,అతని సొంత భూమిలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న వారిపై ఫిర్యాదులు సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా *దళిత యువకుడు తల్వార్ నరేష్ మాట్లాడుతూ నారాయణ పేట జిల్లా,మండలం,వడ్వాట్ గ్రామ శివారులో గల మా సొంత పట్టా భూమి ఒక ఎకరం ఆరు గుంటల (1.06 ) లోకి మా పొలం పక్కన మేరలో గల ముదిరాజ్ కులానికి చెందిన గుంటగారి అశోక్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా రానివ్వకుండా, పొలాన్ని దున్నడానికి వెళ్లినపుడల్లా దౌర్జన్యంగా అడ్డుకొని కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయమై ఇప్పటికే మాగనూరు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి16 రోజులైనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ దళిత యువకుడు తల్వార్ నరేష్ ను అతని పొలంలోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్న వ్యక్తిపై మాగనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి 16 రోజులైనప్పటికీ పోలీసులు FIR ను ఎందుకు నమోదు చేయలేకపోయారని ప్రశ్నించారు.ఇట్టి విషయంలో దళిత యువకుడు తల్వార్ నరేష్ కి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామన్నారు.వెంటనే పోలీస్ అధికారులు సమస్యను పరిష్కరించి ఇరువర్గాల మధ్య సామరస్య పూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృధ్విరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, దళిత యువకుడు తల్వార్ నరేష్ పాల్గొన్నారు.