పయనించే సూర్యుడు బాపట్ల మే:- 7 రిపోర్టర్ (కే శివకృష్ణ )
డాక్టర్ గుదే రాజారావు మాట్లాడుతూ దళితులు క్రిస్టియన్ మతంలోకి మారిన మరుక్షణం ఎస్సీ హోదా కోల్పోతుందని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరం,ఏ మతంలోకి మారినా దళితులు అంటరానితనానికి, వివక్షతకు గురవుతూనే ఉన్నారు. క్రిస్టియానిటీ కులాన్ని గుర్తించకపోయినా కులవివక్ష కొనసాగుతున్నదని అనేక నివేదికలు వెల్లడించాయి. మన దేశంలో కులం మతంపై ఆధారపడిలేదు. వ్యవస్థీకృతమై ఉంది. కులం పునాదుల్ని తొలగించడానికి అవసరమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక చర్యల్ని తీసుకోవాలి. కాబట్టి దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. అందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో మతం కులం ఫై ఆధారపడి దళితులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయలేరని, ఒకవేళ ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినా, అది చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది,మతం మారిన మాత్రాన కులం మారిందా కులానికి మతానికి ముడి పెట్టొద్దని, ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని రానున్న కాలంలో దళిత క్రైస్తవులపై దాడులు వేధింపులు,మరియు ఆర్థికంగా అణచడానికి ఈ సూచనలని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది