పయనించే సూర్యుడు ఏప్రిల్ 20 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందుమాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఉకే అబ్బయ్య కుమారుడు ఉకే ప్రభాకర్ దశదిన కార్యక్రమం ఈరోజు హనుమంతులపాడు వారి స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, మాజీ ఎంపీటీసీలు పూనెం సురేందర్, పాయం కృష్ణ ప్రసాద్, మండల మహిళా నాయకులు బానోత్ శారద, ప్రసన్న కుమార్ యాదవ్, పట్టణ మహిళా అధ్యక్షులు స్వరూప, అఫ్రీద్, తదితరులు పాల్గొన్నారు