
పయ నించే సూర్యుడు జనవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూటమి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలసి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమమునకు కాట్రేనికోన మమ్మిడివరం రూరల్ ముమ్మిడివరం టౌన్ ఐ పోలవరం తాళ్ళరేవు మండలాల నుంచి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినారు అనంతరం స్వామి వివేకానంద 163 జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా పుష్పమాలవేసి స్వామి వివేకానంద వారికి నివాళులర్పించినారు అనంతరం యువత యువకులు వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని అని అన్నారు
