పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 7 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్ పల్లి నియోజకవర్గం లో వాయిస్ స్టూడియో న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయలు, మున్నూరు కాపు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న దాదే వెంకట్ పటేల్ జన్మదిన వేడుకలు భాగ్యనగర్ కాలనీలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవా తత్పరులు కూకట్పల్లి ఆంధ్రప్రభ విలేకరి దాసరి రాహుల్ ప్రదీప్, తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, ఇప్ప రాకేష్ పటేల్, పంతం వెంకటేష్ పటేల్, కుల్ల రాజు పటేల్, గంగరాజు, చంద్ర, మారుతి సాగర్, పగుడాల వెంకటేష్ లతో కలసి కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని. మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం లో మరెన్నో ఉన్నత మైన పదవులను అధిరోహించాలని వారు కోరుకున్నవన్నీ ఆ భగవంతుడు నెరవేర్చాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.