
పయనించే సూర్యుడు ఆగస్ట్ 4 (సూళ్లూరుపేట నియోజకవర్గO రిపోర్టర్ దాసు)తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, తిరుమలపూడి గ్రామం నుండి బహుజన సమాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పామాంజి సురేష్ , రామ్మూర్తి మరియు వారి కుటుంబం బుద్ధ విహార్, కావలి ని దర్శించారు. కారణం ఏమనగా? ఇటీవల వారి తండ్రిగారు పరినిర్వాణం చెందారు. దానికిగాను తండ్రిగారి అంత్యక్రియలు మరియు పుణ్యానుమోదనం బౌద్ధ సంప్రదాయంలో నిర్వహించడం జరిగింది. అయిననూ! వారి ఇంట్లో తిరుగుతున్నప్పుడు వారి తండ్రి గారు పదేపదే జ్ఞాపకం రావటం వలన వారి కుటుంబం మానసిక బాధకు లోనౌతున్నారు. ఈ బాధ ఉపశమనం కోసం బుద్ధ విహార్, కావలి ని దర్శించటం జరిగింది. వారు ఇంగిలాల రామచంద్రయ్య గారు స్థాపించిన 'అంబేద్కర్ ధర్మ పోరాట సమితిలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.