విద్యార్థుల సమస్యలు పరిష్కారం చూపకుండా కార్యక్రమాలేలా?
మిస్ వరల్డ్ పోటీలపై రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్.
భారతదేశ పాకిస్తాన్ యుద్ధంలో ఇదొకటి అందాల పోటీ తెలంగాణలో జర ఆలోచించండి ప్రజల్లారా
( పయనించే సూర్యుడు మే 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి, మే 10:దేశం శత్రు దేశం అయినా పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుంటే ఇక్కడ తెలంగాణ లో మాత్రం మిస్ వరల్డ్(అందాల)పోటీలను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్…నేటి నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ పోటీలపై మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,,,ఒకవైపు తెలంగాణ లో విద్యార్థులు అనేక సమస్యలు,ఇబ్బందులు పడుతుంటే,ఇంకోవైపు దేశంలో పాకిస్తాన్ తో యుద్ధం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కి అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని సూటిగా ప్రశ్నించారు.ఒకవైపు అభివృద్ధి కోసం నిధులు పుట్టడం లేదంటూనే మరోవైపు కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఎందుకని అన్నారు. అందాల పోటీల ద్వారా యువతకు, విద్యార్థులకు, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.ఒకవైపు భారతదేశంలో పాకిస్తాన్ యుద్ధంలో వీర జవాన్లు ఆర్మీలో వీర మరణం పొందుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి అందాల పోటీ కావాల్సి వచ్చిందా అంటూ హెద్దెవా చేశారు. ఒకవైపు ఆర్మీ జవాన్లు దేశం కోసం యుద్ధం చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మిస్ వరల్డ్ అందాల పోటీ చేయడం చాలా సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వంపై అగ్రహాం వ్యక్తం చేశారు.భారతదేశంలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలారా కొంచెమైనా ఆలోచించండి అని అన్నారు.