
పయనించే సూర్యుడు ఆగస్టు 15 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంమురమళ్ల: సుదీర్ఘ కాలంగా దేవాదాయశాఖ లో విశేష సేవలు అందిస్తున్న జిల్లా దేవాదాయ శాఖ అధికారి, శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ వి సత్యనారాయణ కు 80 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా చేతులు మీదుగా విశిష్ట పురస్కారం లభించింది. ఆగస్టు 15 అమలాపురం లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కారం అందుకొన్నారు. కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ అధికారిగావేదపండితులకు నిరుద్యోగ భృతి,జిల్లాలో వేదవిద్యను అభ్యసించి నిరుద్యోగులు గా ఉన్న 60 మంది వేదపండితులకుఒక్కొక్కరికి నెలకు రూ.3,000 /- భృతి మొత్తం సంవత్సరానికి రూ.1,80,000 /-ధూప దీప నైవేద్యం స్కీమ్ జిల్లాలోని 206 దేవాలయాలకు ఈ స్కీమ్ కింద సహాయం ఒక్కో దేవాలయానికి నెలకు రూ.10,000 /-మొత్తం రూ.20,60,000 /-టి.టి.డి. శ్రీవాణి ట్రస్టుటీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా 110 దేవాలయాలకు మొత్తం,రూ.31,10,00,000 /- నిధులు మంజూరు చేయడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ (సి.జి.ఎఫ్) 27 పురాతన దేవాలయాల పునఃనిర్మాణం, మరమ్మత్తులకు మొత్తం రూ.26,98,50,000 /- నిధులు మంజూరు అయ్యేందుకు ఆయా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో కలిసి విశేష కృషి చేశారు.శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటిడి ఆలయం లో స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు తో కలిసి గ్రామస్తుల సహకారం తో పలు అభివృద్ధి కార్యక్రమాల కు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థంవేద ఆశీర్వచనం వంటి సేవలు ప్రవేశపెట్టారు.సుమారు 14 కోట్ల రూపాయలు వ్యయం తో ఆలయ పునః నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.ఈసందర్భంగా పురస్కారం అందుకున్న అసిస్టెంట్ కమీషనర్ వారికి శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు, చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ ధార్మిక సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు అభినందనలు తెలియజేశారు.