పయనించే సూర్యుడు న్యూస్ మే 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మానవాళిని గడగడలా డించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన కొవిడ్ 19 మళ్లీ పంజా విసురుతోంది. ఆసియా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్ లలో కొవిడ్ -19 వ్యాప్తి పెరిగింది. వారం వ్యవధి లోనే వేల సంఖ్యలో కేసు లు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ కొన్ని కేసులు నమోదు అవుతున్నప్పటికీ తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జేఎన్ 1వేరియంట్, దాని ఉప రకాలతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు వెలుగు చూడడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని వెల్లడించింది.ప్రస్తుతం పెరుగుతున్న కేసులకు JN.1 వేరియంట్, దాని సంబంధిత ఉప-రకాలు కారణమని భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ BA.2.86 కుటుంబానికి చెందినదని అంటున్నారు. ఆసియా దేశాల్లోనే… జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలు ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 కారణంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది.జేఎన్.1 రకం వేరియంట్ పెరగడాన్ని బట్టి.. ఇంతకు మునుపు తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం తగ్గుతు న్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. థాయ్‌లాండ్‌లో ఈనెల 11-17 మధ్య కాలంలో ముప్పై మూడు వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బ్యాంకాక్‌లోనే ఆరు వేల కేసులున్నాయి.హాంకాంగ్‌లోనూ కొవిడ్ కేసులు గత నెల 6-12 తేదీల6.21తో పోలిస్తే.. 13.66శాతానికి చేరు కుంది. చైనాలో పాజిటివిటీ రేటు 3.3 నుంచి 6.3శాతా నికి పెరిగింది. భారత్ లోనూ కేసుల నమోదు దేశంలోనూ కరోనా కేసులు నమోదవుతుండడంప ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే భారత్ లో రెండు వందల యాబై కి పైగా కొవిడ్ పంతొమ్మిది కేసులు నమోదయ్యాయి. మే పన్నెండు తారీకు నుంచి వారం వ్యవధిలోనే 164 కొత్త కేసులు నమోదయ్యాయి, ముఖ్యంగా కేరళ, మహా రాష్ట్ర, తమిళనాడులో కేసులు ఎక్కువగా నమోద వుతున్నాయి. అయితే భారత్‌లోకి కరోనా వైరస్ వేరియంట్లు వెలుగు చూసిన ప్రతీసారి.. దాని మూలాలు కేరళలోనే ఉంటున్నాయి.ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిన వేళ కేరళ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఒక్క మే నెలలోనే కేరళ వ్యాప్తంగా 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు.