రుద్రూర్, మే 12 (పయనించే సూర్యుడు, రుదురు మండల ప్రతినిది):
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేసి, కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రుద్రూర్ మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు సోమవారం సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్మిక కోడ్ లతో కష్టజీవులు కష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ఆవిష్కరణలో సీఐటీయూ నాయకుడు నన్నేసాబ్, అంగన్ వాడీ యూనియన్ నాయకురాలు గంగామణి, ఆశా యూనియన్ నాయకులు భూలక్ష్మి, వాణి, లతా, పుష్ప తదితరులు పాల్గొన్నారు.