
పయనించే సూర్యుడు మార్చి 2 ముమ్మిడివరం ప్రతినిధి
దేశ ప్రగతికి సామాజిక విభేదాలు విడచి సమైక్యంగా పనిచేయాలని, దేశ సమగ్ర అభివృద్ధి కోసం పంచ పరివర్తన కార్యక్రమాలపై పనిచేయాలని,ముమ్మిడివరం అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన సద్భావన సదస్సు కార్యక్రమంలో హాజరైన వడ్డాది వెంకట సుబ్బారావు పిలుపునిచ్చారు. సద్భావన సంయోజక్ విత్తనాల రవితేజ మాట్లాడుతూ హిందూ సమాజం వివిధ కులాలగా మనుగడ సాగిస్తున్నందున వారిలో అందరూ ఒక్కటే అనే భావాన్ని తీసుకొని రావడానికి కృషి చేయాలని ఉద్దేశంతో ఈ సదస్సులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 15 కులాలవారు 24 గ్రామాల నుండి 100 మంది పాల్గొన్నారు అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ రహిత సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో సద్భావన సంయోజక్ విత్తనాల రవితేజ, పెన్మత్స గోపాల కృష్ణంరాజు , గొలకోటి వెంకటరెడ్డి, నంద్యాల నరసింహస్వామి, గాదిరాజు విశ్వనాథరాజు, పేరాబత్తుల రామకృష్ణ, కొడమర్తి వెంకటరత్న శర్మ, తటవర్తి నాగరాజా రావు, కుడిపూడి దుర్గాప్రసాద్, సలాది శ్రీనివాసరావు, బొంతు కనకారావు, రెడ్డి రమణారావు,పొత్తూరి సత్తిబాబు రాజు, సన్నిధి రాజు వీరభద్ర శర్మ, రెడ్డి నాగభూషణం, సఖిరెడ్డి శ్రీను, కోలా మీరయ్య, రేవు సింహాచలం, యేడిద దొరబాబు,, గాలి దేవర వెంకటరమణమూర్తి, తోటకూర వెంకట తిరుపతి రాజు,పాలెపు రామకృష్ణ, కోలా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
