
రాజ్యాంగ విలువల కోసం పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి
కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండ పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా14 సెప్టెంబర్ 2025 కొండాపూర్ మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే రాజయ్య మాట్లాడుతూ మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు SFIకి మాత్రమే కాకుండా, భారతీయ విద్యార్థి-యువజన ఉద్యమానికి, మార్క్సిస్టు ఉద్యమానికి, దేశీయ రాజకీయాలకు అపారమైన సేవలందించారు. 1974లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో చదువుతూ SFIలో చేరిన ఆయన, 1978లో అఖిల భారత జాయింట్ సెక్రటరీగా, తర్వాత అఖిల భారత అధ్యక్షుడిగా (1978-1986) ఎన్నికయ్యారు. కేరళ లేదా బెంగాల్ నుంచి కాకుండా మొదటి అధ్యక్షుడిగా SFI చరిత్రలో ఆయన పేరు ముందుంది. SFI మొట్టో "స్టడీ అండ్ స్ట్రగుల్" (చదువు-పోరాటం)ని జీవితమంతా అనుసరించి, విద్యార్థుల హక్కుల కోసం, విద్యా విధానాల పోరాటంలో ముందుండేవారు. ఆయన SFI జర్నల్ "స్టూడెంట్స్ స్ట్రగుల్" ఎడిటర్‌గా కూడా పనిచేసి, విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకన్న అనీలు అర్జున్ ఎల్లేష్ నాయకులు రామ్ చందర్ చంద్రం తదితరులు పాల్గొన్నారు