పయనించే సూర్యుడు మే 24 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
సుండుపల్లి : మండల తహసిల్దార్ కార్యాలయంలో దొంగ పాసు పుస్తకాలు జారీ కేసులో గతంలో అటెండర్ గా పనిచేసిన పూజారి నాగన్నపై సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరు పరిచారు.ఈ కేసుకు సంబంధించి రాయచోటి కోర్టు వారు పూజారి నాగన్నకు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.మండల వ్యాప్తంగా కొంత మంది రైతుల వద్ద నుంచి భూమికి పాసు పుస్తకాలు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి దొంగ పాసు పుస్తకాలు జారీ చేయించిన కేసులో అరెస్ట్ చేసినట్టు ఎస్సై ముత్యాల శ్రీనివాసులు తెలిపారు.