
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు)
దొరవారిసత్రం లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ జీవీ చౌదరి ఈరోజు ఉదయం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో నిఘా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎలాంటి ఉపేక్ష ఉండదని తేల్చిచెప్పారు. ప్రజల సహకారం లేకుండా శాంతిభద్రతలు సాధ్యం కావని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ‘శ్రీ శక్తి’ యాప్ ద్వారా అత్యవసర సమయంలో వెంటనే ఫిర్యాదు చేయవచ్చని అవగాహన కల్పించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని ఎస్ఐ జీవీ చౌదరి స్పష్టం చేశారు.
