
పయ నించే సూర్యుడు జూలై 30 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో రామచంద్రపురం నియోజకవర్గ బిజెపి సంస్థాగత సమావేశం జరిగింది. నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్ కన్వీనర్ సలాది శేఖర్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, జిల్లా బిజెపి ఇంచార్జి కారంకి శ్రీనివాస్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమా, బిజెపి సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు తదితరులు విచ్చేశారు.ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌ను బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి బూత్‌లో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. కొత్త కార్యకర్తలను చేర్చుకోవడం, ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాలని నాయకులు కార్యకర్తలకు తెలిపారు.స్థానిక ఎన్నికలు పార్టీ బలాన్ని నిరూపించే కీలక అవకాశమని, క్రమశిక్షణ, సమన్వయం, సేవాభావంతో పనిచేస్తే పార్టీ విజయం తథ్యమని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు, జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు, ఎం.పి.టి.సి కొప్పన లక్ష్మి, మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, పుణ్యమంతుల శివాజీ, దునే శ్రీనివాస్, కొప్పిశెట్టి చంద్రరావు, బిజెపి కార్యవర్గ సభ్యులు అవసరాల వెంకటరమణ మూర్తి, కొట్టువాడ హరిబాబు, జిల్లా బిజెపి యువ మోర్చా అధ్యక్షులు గాణాల కళ్యాణ్, గంగవరం బిజెపి ఇంచార్జ్ రాఘవేంద్ర తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.