
పయనించే సూర్యుడు జూన్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అగ్నిప్రమాద బాధిత వ్యాపారులకు కొండంత అండగా నిలిచిన మంత్రి వాసంశెట్టి సుభాష్ఇచ్చిన మాట ప్రకారం వేగంగా షెడ్ల నిర్మాణానికి శ్రీకారండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం,ద్రాక్షారామం మార్కెట్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన 48 షాపుల పునర్నిర్మాణానికి సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇచ్చిన హామీ మేరకు, ఆయన చొరవతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి మార్కెట్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఆర్డీవో సరళావతి, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వర్తక సంఘం అధ్యక్షులు అల్లం సుబ్బారావు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. వర్తక సంఘం సభ్యులు, వ్యాపారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.కొద్ది రోజుల క్రితం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో 48 దుకాణాలు పూర్తిగా దగ్ధమై, వాటిపై ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్య లో పాల్గొని బాధితులను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని, మార్కెట్‌ను తిరిగి నిర్మించి వ్యాపారులకు అందజేస్తామని హామీ ఇచ్చిన విషయం విధితమే.మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, కూటమి పార్టీ నాయకులు, దాతల సహకారంతో నిధులు సమీకరించి మార్కెట్ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొద్ది రోజుల్లోనే పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం పట్ల బాధిత వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చిక్కాల దొరబాబు, మాగాపు అమ్మిరాజు, రేవు శ్రీను, చిక్కాల సుబ్రహ్మణ్యం, కూటమి పార్టీ నాయకులు, అధికారులు, సహకరించిన దాతలు, వర్తక సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా భావించి ద్రాక్షారామం మార్కెట్‌ను త్వరితగతిన నిర్మించి బాధిత వ్యాపారులకు అందజేస్తాం అనే మంత్రి వాసంశెట్టి సుభాష్ సంకల్పానికి అనుగుణంగా పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల వర్తక వ్యాపారులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.