పయనించే సూర్యుడు న్యూస్ మే 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ హైదరాబాద్ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ద్వారకానగర్ లో మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గొట్టిముక్కుల పాండురంగారావు, తెలంగాణ సినిమా రచయితల సంఘం అధ్యక్షులు పులి అమృత్, రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్, సిపిఎం నాయకులు శోభన్, కృష్ణ, శేరిలింగంపల్లి మండల కార్మిక సంఘం అధ్యక్షులు బాజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకుంటున్న సమయంలో మేము మనుషులమే మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయని ఈ చాకిరి మేము చేయలేమని పనిముట్లు కింద పడేసి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం పోరాడటం కొందరు కార్మికులు ప్రాణాలు వదలడం జరిగిందని, ప్రపంచవ్యాప్తంగా జరిగిన కార్మిక ఉద్యమంలో చివరికి కార్మికులు విజయం సాధించి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకోగలిగారని వారు అన్నారు. చికాగోలో జరిగిన కొంతమంది కార్మికుల రక్త తర్పణం ఫలితంగా మేడే ఉత్సవాలను. జరుపుకుంటారు