బాపట్ల పట్టణ ఎస్సై చంద్రవతి*
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 2 :- రిపోర్టర్ (కే.శివ కృష్ణ)ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరని బాపట్ల పట్టణ ఎస్సై చంద్రవతి అన్నారు.బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని ద్విచక్ర వాహనదారులకు తెలిపారు. హెల్మెట్ వాడి రోడ్డు ప్రమాదాల నుండి కాపాడుకోవాలన్నారు.*డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడిన, మద్యం సేవించి వాహనాలు నడిపినా చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసుల నమోదుకు వెనుకాడేది లేదన్నారు.